Posts

Showing posts with the label trs meeting

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting

Image
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎప్పటిలాగే తన సెంటిమెంట్‌ సభకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే ఎన్నికల ఆరంభ సభ అదిరేలా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌లు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఎన్నికలకు వెళ్లేందుకు ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. అదే ఊపుతో పాల్గొనే హుస్నాబాద్‌ సభను విజయవంతం చేయడం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కీలకం కాగా.. ఇది ఎన్నికల తొలి ప్రచార సభ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపూ హుస్నాబాద్‌పైనే ఉంది. ఈ సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీని ద్వారా నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్‌ ఉత్సాహాన్ని నింపుతారని పార్టీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి సమర శంఖం పూరించనున్నారు. ఇక్కడ మొదలు పెట్టిన ఎన్నికల సభలను నిరంతరాయంగా 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చే...