(తెరాస) ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు, పార్టీ తరపున పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కె.కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ * కె.కేశవరావు(ఛైర్మన్) * ఏపీ జితేందర్‌రెడ్డి * జి.నగేష్ * ఈటల రాజేందర్ * టి.హరీష్‌రావు * జి.జగదీష్ రెడ్డి * తలసాని శ్రీనివాస్‌యాదవ్ * అజ్మీర చందూలాల్ * టి. పద్మారావు * కొప్పుల ఈశ్వర్ * పల్లా రాజేశ్వర్‌రెడ్డి * ఫరీదుద్దీన్ * పి.రాములు * గుండు సుధారాణి