తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది telangana state ministers suspense

 తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్‌ రానున్న కేసీఆర్‌.. కేబినెట్‌ కూర్పుపై స్పష్టత ఇస్తారని తెరాస ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. కేసీఆర్‌, మహమూద్‌ అలీ ఇప్పటికే కేబినెట్‌లో ఉన్నందున.. మరో 16 మందికి అవకాశం ఉంటుంది. కేటీఆర్‌, హరీశ్‌రావుకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. మిగతా స్థానాల కోసం తెరాస ఎమ్మెల్యేల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. జనవరి 3లోగా మొదటి విడత మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరు లేదా ఎనిమిది మందికి చోటు దక్కే అవకాశముంది. పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రెండు, మూడు విడతల్లో పూర్తిస్థాయిలో కేబినెట్‌ విస్తరణ చేసే దిశగా యోచిస్తున్నట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting

నేడే హుస్నాబాద్‌లో కేసీఆర్‌ శంఖారావం ఇదే టీఆర్‌ఎస్‌ తొలి ఎన్నికల ప్రచార సభ 50 రోజుల్లో 100 ప్రజా ఆశీర్వాద సభలు: హరీశ్‌