నేడే హుస్నాబాద్‌లో కేసీఆర్‌ శంఖారావం ఇదే టీఆర్‌ఎస్‌ తొలి ఎన్నికల ప్రచార సభ 50 రోజుల్లో 100 ప్రజా ఆశీర్వాద సభలు: హరీశ్‌

ముఖ్యమంత్రిగా అధికారులతో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ప్రగతి భవన్‌లోనే ఎక్కువ సమయం గడిపిన కేసీఆర్‌.. ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం హుస్నాబాద్‌ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఎన్నికల శంఖం పూరించబోతున్నారు. ప్రగతి నివేదన సభ విజయవంతం కావడంతో అదే జోష్‌లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించడానికి టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. 50 రోజుల్లో 100 సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వంద సభల్లోనూ పాల్గొంటానని కేసీఆర్‌ ప్రకటించారు. అందులో హుస్నాబాద్‌ సభ మొదటిది. ఈ సభ ఏర్పాట్లను గురువారం రాత్రి మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో కేసీఆర్‌ సభాస్థలికి చేరుకుంటారని తెలిపారు. ఇది చరిత్రాత్మక సభగా నిలవనుందని, పట్టణంలో 10 వేల మంది, చుట్టుపక్కల గ్రామాల నుంచి మరో 10 వేల మంది పాదయాత్రగా వస్తున్నారన్నారు. హుస్నాబాద్‌తో పాటు తెలంగాణలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు.

అందరి చూపు హుస్నాబాద్‌ వైపు
అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత తొలి ఎన్నికల సభకు వేదిక కానున్న హుస్నాబాద్‌పై రాష్ట్రంలోని అందరి దృష్టి పడింది. హుస్నాబాద్‌ పట్టణంలోని బస్‌ డిపో గ్రౌండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించే ప్రజా అశీర్వాద సభకు సర్వం సిద్దం చేశారు. 2014, ఏప్రిల్‌ 17న కేసీఅర్‌ సభ నిర్వహించిన మైదానంలోనే మళ్లీ ఈ ప్రజా అశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ తొలి సభను విజయవంతం చేసేందుకు మంత్రి హరీశ్‌ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఈ సభకు 65 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రతి మండలానికి ఎమ్మెల్యే, మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించారు. వంద మంది కూర్చునే విధంగా వేదికను తయారు చేశారు. హుస్నాబాద్‌ను గులాబీమయం చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించతలపెట్టిన తొలి సభ నేపథ్యంలో భారీగా పోలీస్‌ బందోబస్తు చేపట్టారు. పట్టణంలోకి వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది telangana state ministers suspense

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting