ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసినా తెరాస 100 సీట్లు గెలుస్తుంది. తెరాస విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని,దేశంలో అతిపెద్ద బఫూన్‌ రాహుల్‌గాంధీ అని ఆరోపించారు. తెరాస

పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు అండగా ఉంటారా?
ఆ పార్టీ మమ్మల్ని ఆహ్వానించలేదు. ఎంఐఎంతో స్నేహంగా ఉండే పార్టీతో పొత్తులు ఉండనే ఉండవని అమిత్‌షా చెప్పాడు. మమ్మల్నే మోదీ వ్యతిరేకి అంటున్నారు. ఈ ఎన్నికలు పూర్తయితే మేం కేంద్రంలో మోదీ వ్యతిరేకా? కాంగ్రెస్‌ వ్యతిరేకా? అనేది తెలుస్తుంది. భాజపా నేతలు మాట్లాడితే అంతే ఉండదు. వారి కథ తెలీదా? ఉన్న సీట్లలో గెలిస్తే చాలా గొప్ప. మాటలకు ఎన్నైనా మాట్లాడవచ్చు. పొద్దున్నే ప్రధాని కావాలని నాకుంది. అయితానా? కలలు మస్తుగా ఉంటాయి. భాజపా సంగతి సత్తా తెలియదా? వారేదో మాట్లాతుంటారు. అది నిజమవుతుందా? సమాఖ్య కూటమి మాటేమిటి?
ఇప్పటికే నేను చెప్పాను. ప్రధాని, 29 రాష్ట్రాల సీఎంల సమావేశంలోనూ వెల్లడించాను. కేంద్రం వద్దే ఎన్ని అధికారాలు పెట్టుకుంది. దేశంలో కేంద్రీకరణ పెరుగుతోంది. కేంద్రం వద్ద విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి ఎందుకు? ఇవన్నీ రాష్ట్రాలకు ఉండాలి. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఎందుకు ఇవ్వరు? నా డిమాండ్‌ ఇలాగే ఉంటుంది.
వచ్చే ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, దీనిపై మరో ఆలోచనకు తావులేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... ప్రతిపక్షాలు ఏకమై పొత్తులు పెట్టుకున్నా తెలంగాణలో 100 సీట్లలో తెరాస విజయం సాధిస్తుందని చెప్పారు. దేశంలో అతిపెద్ద బఫూన్‌ రాహుల్‌గాంధీ అని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోలేదని, ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా ఏమిటో స్పష్టమవుతుందన్నారు. ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే ఎక్కువగా చేపట్టామని వెల్లడించారు. మజ్లిస్‌తో కొన్నిస్థానాల్లో స్నేహపూర్వక పోటీకి అవకాశముందని ప్రకటించారు. దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులేనన్నారు. డీఎస్‌కు మంచి గౌరవం ఇచ్చామని, ఆయన వ్యవహారశైలిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఛార్టెడ్‌ విమానాలను నాలుగుసార్లే వినియోగించామన్నారు. ప్రజల సొమ్ముతో కూడిన ప్రయాణాన్ని రక్షణ బృందాలు నిర్ణయిస్తాయని చెప్పారు.  ఫెడరల్‌ ఫ్రంట్‌ కేంద్రంలో చక్రాలు తిప్పడం కోసం కాదని, ప్రజా ప్రయోజనాల కోసమని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు మోదీ ప్రతిపాదన అని, జమిలీ ఎన్నికలకు సిద్ధమా అని మోదీ అడిగితే సిద్ధమని చెప్పానన్నారు.

రెండు పడకగదుల ఇళ్లు, మిషన్‌ భగీరథ నీళ్లు ఇవ్వందే ఎన్నికలకు వెళ్లనన్నారు కదా?
ఈ పథకాలకు గడువు లేదు. రాష్ట్రంలో 2.60 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పాం. అవన్నీ కట్టిస్తున్నాం. ఈ పనులు జరుగుతున్నాయి. మిషన్‌భగీరథ నీళ్లు 22,600 గ్రామాలకు బల్క్‌ సరఫరా అందుబాటులోకి వచ్చింది. ఇంకా 1,100 గ్రామాలకు త్వరలో వస్తుంది. 46 శాతం ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చాం. ఒకవేళ నీళ్లివ్వకుంటే ప్రజలు ఓట్లు వేయరు కదా.

ఎన్నికల్లో మీరు మళ్లీ గెలుస్తారా?
మాకు వచ్చిన సర్వేల్లో అనేక అంశాల్లో ప్రతిపక్షాలెవరూ దగ్గరగా లేరు. 82 నియోజకవర్గాల్లో 60 శాతం పైబడి ఓట్లు మాకే. ఇదేం ఆషామాషీగా చెప్పడం లేదు. 100లో 50 శాతం పైబడి ఉన్నాం. 112 స్థానాల్లో మాకే మొగ్గు. ఏడు ఎవరికి వెళ్తాయో అందరికీ తెలుసు. అన్ని పార్టీలు కలిసినా తెరాస 100 సీట్లు గెలుస్తుంది. ప్రజల్లోకి వెళ్లిన తరువాత చర్చ ఎందుకు? ప్రతిపక్షాలు ముందుకు వచ్చి నిరూపించుకోవాలి. మంచికైనా చెడుకైనా ప్రజలే న్యాయనిర్ణేతలు.

కాంగ్రెస్‌ను చూసి భయపడుతున్నారా? రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు కదా?
రాహుల్‌గాంధీ దేశంలోనే అతిపెద్ద బఫూన్‌ అని అందరికీ తెలుసు. మోదీని పార్లమెంటులో కౌగిలించుకుని, కన్నుగీటి పరువు తీశారు. రాహుల్‌గాంధీ దిల్లీలోని కాంగ్రెస్‌పార్టీ  సామ్రాజ్యానికి వారసుడు, చక్రవర్తి. మనం చక్రవర్తులకు బానిసలు కావద్దు. తెలంగాణ నిర్ణయం తెలంగాణలో కావాలి. ఈ విషయమై ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్‌ సమస్యలు మీకు తెలుసు. దిల్లీకి వెళ్లి దర్వాజాల వద్ద నిలబడతారు. హైదరాబాద్‌లో వీరికి టికెట్లు ఇవ్వరు. దిల్లీ నుంచి తెచ్చుకోవాలి.
మజ్లిస్‌ మీ మిత్రపక్షం కదా.. వారి స్థానాల్లో అభ్యర్థులను నిలిపారేంటి?
మజ్లిస్‌ మా స్నేహపూర్వక పార్టీ. అవసరమైతే కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరిగినపుడు ఒవైసీ అండగా నిలిచారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తనకు తానుగా దిల్లీ నుంచి ఫోన్‌ చేసి మద్దతిచ్చారు. తెరాస, మజ్లిస్‌తో స్నేహంగా ఉంటూ పనిచేస్తుంది. నేను భాజపాకు దగ్గర అంటున్నారు. ప్రధాని మోదీతో సీఎంగా పలు విషయాలపై రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సి ఉంటుంది. నిన్న కూడా రక్షణశాఖ స్థలాల కేటాయింపుపై మాట్లాడాను. దిల్లీలో పీఎంగా ఎల్లయ్య ఉన్నా.. మల్లయ్య ఉన్నా మాట్లాడాల్సిందే. భాజపా, తెరాస గోత్రాలు వేరు.. ఎప్పటికీ కలవరు.
తొమ్మిది నెలలకు ముందుగానే ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు?
ప్రతిపక్షాల్లో అసహనం పెరుగుతోంది. మతిలేని, ఆధారరహిత, అడ్డూ అదుపులేని తప్పుడు ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఒక్క ఆరోపణ నిజమని చూపించారా? ప్రగతినివేదన సభపై అవాకులు చవాకులు మాట్లాడారు. స్థలం తక్కువగా ఉంది. రోడ్డుపై చుట్టూ 40 వేల వాహనాలు నిలిచిపోయాయి. సభ అట్టర్‌ప్లాప్‌ అంటారా? ప్రతిపక్షాల మెదళ్లు దెబ్బతిన్నాయా? ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. దీనిపైనే ప్రజా కోర్టులోకి వెళ్తున్నాం. మాకు మెజారిటీ ప్రభుత్వం ఉన్నా త్యాగం చేసి ప్రజల కోసం, సుస్థిర అభివృద్ధి కోసం ఎన్నికలకు వెళ్తున్నాను. ఈ దుర్మార్గపు రాజకీయాల నుంచి ప్రజలను రక్షించాల్సి ఉంది.

కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోందని నమ్ముతున్నారా?
కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ పుంజుకుంటోంది? ఆ పార్టీ ఫలానా రాష్ట్రంలో 20 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పగలదా? వారిది భ్రాంతి. మేం వాస్తవికంగా ఉంటాం. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే చనిపోతే ఆయన కొడుకును నిలబెట్టారు. అక్కడ 53 వేల మెజారిటీతో గెలిచాం. పాలేరులో ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి భార్య ఉపఎన్నికల్లో పోటీ చేస్తే అక్కడ మేమే 46 వేల ఓట్లతో గెలిచాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 5డివిజన్లు కూడా గెలవలేదు. కాంగ్రెస్‌ ఎంత పుంజుకుందో.. ఏడ పుంజుకుందో ఎన్నికలకు వెళ్తే తెలుస్తుంది. మేం అందుకే ఎన్నికలకు వస్తున్నాం. దీనిని కాంగ్రెస్‌ స్వాగతించాలి కానీ భయపడుతోంది.

ఉద్యోగులకు మధ్యంతర భృతి ఎందుకు ఇవ్వలేదు?
తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం ప్రమాద భత్యం ఇస్తోంది ఒక తెలంగాణాయే. గత ప్రభుత్వాలు బానిసచాకిరీ చేయించుకున్న చిన్నతరహా ఉద్యోగులైన ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు, ఐకేపీలో పనిచేసేవారికి జీతాలు పెంచాం. ఇంకా పెంచుకోవాలని ఉంది. ఈ పార్టీని గెలిపించుకోండి. మంచిగ.. సల్లగ బతకండి.
తెరాసలో ఆశావహులు ఎక్కువ ఉన్నారు? టికెట్‌ రానివారంతా అసంతృప్తికి గురికారా?
మనకు ఉంది 119 స్థానాలే. చాలామంది టికెట్లు అడుగుతున్నారు. మాకు కార్యకర్తలు 70 లక్షల మంది ఉన్నారు. అందరికీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా చేయలేం కదా. టికెట్‌ రానివారి బాధ మేం చూసుకుంటాం.
కాంగ్రెస్‌, తెదేపాలు మహాకూటమిగా ఏర్పడుతున్నాయి? మీరెలా ఎదుర్కొంటారు?
తెలంగాణలో తెదేపా అసలు ఉందా? 17 సర్వేలు చేయిస్తే ఎక్కడా 0.1.శాతం నుంచి 1 శాతం కూడా లేదు. లేని దాని గురించి ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్‌తో పెట్టుకుంటే ఏ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. చంద్రబాబు పొద్దున లేచి మనపై అభాండాలు వేస్తారు. గోదావరి, కృష్ణా నీటిపై ఉత్తరాలు రాస్తూ ఫిర్యాదులు చేస్తుంటారు. సుప్రీంకోర్టులో కేసులు వేస్తుంటారు. వీరు వెళ్లి వారితో పొత్తు పెట్టుకుంటారా? ఇది రాజకీయమా? దాన్ని మీరు సమర్థిస్తారా? వారి వైఖరి జుగుప్సాకరం. మళ్లీ ఆంధ్రా పాలకులను ఇక్కడికి తీసుకువస్తారా? తెలంగాణ మళ్లీ ఆంధ్రా పార్టీలకు గులాం కావద్దు. మనం స్వతంత్రంగా ఉండాలి. లేచినోడో, లేవనోడో.. తెలంగాణకు తెలంగాణవాడే శాసనకర్తగా ఉండాలి.

ముందస్తు ఎన్నికలు ఏ పార్టీకీ అచ్చి రాలేదు. గతంలో ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు కదా?
కేసీఆర్‌ గెలుస్తాడు. చంద్రబాబు, ఎన్టీఆర్‌కన్నా మగోణ్ని కావద్దా? చెన్నారెడ్డివల్ల సాధ్యం కాని తెలంగాణను తెచ్చి చూపించి, నిరూపించుకున్నా కదా.

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు?
దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.120 కోట్లు సంక్షేమనిధికి ఇచ్చాం. ఇంటి స్థలాలు ఇస్తామన్నాను. నేను కట్టుబడి ఉన్నాను. వ్యక్తిగతంగా ప్రయత్నించాను. అందరికీ అద్భుతమైన ఇళ్ల స్థలాలు ఇస్తాను. ఇళ్ల స్థలాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందరికీ స్థలాలు ఇస్తాం. కాలనీలు కట్టుకునేందుకు ఆర్థికపరమైన సహకారం అందిస్తాం.

ఈవీఎంలపై మీ అభిప్రాయం ఏమిటి?
ఓడిపోతే ఈవీఎంలను బదనామ్‌ చేయడం మొదటి నుంచి జరుగుతుందే. యూపీఏ-2  గెలిచినప్పుడు భాజపా, ఆ తర్వాత భాజపా గెలిచినప్పుడు యూపీఏ ఇదే మాటన్నాయి. అలాంటి  పనులు చేస్తే అధికారంలో ఉన్నోడు ఓడిపోడు. ఎన్నికల సంఘం సంస్కరణలు అమలు చేస్తోంది. వీవీపాట్‌ పెట్టిన తర్వాత సందేహాలకు తావు లేదు. బ్యాలెట్‌ పేపర్లు పెట్టినా ఏమీ తప్పులేదు.

మీరు ఊహించినట్లే ఎన్నికల కమిషన్‌ సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తుందా?
ఈసీ, కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టాల్సిందే. ఈ మేరకు నిర్ణయం రావాల్సి ఉంది. ఎన్నికల సంఘం ముందుగానే అంగీకరించింది. రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఆలస్యం కాదు. ఆ సమస్య లేదు. వెంట‌నే ఎన్నికలు వస్తాయి.

వచ్చే ఎన్నికలకు ఎలాంటి హామీలు  ఇవ్వబోతున్నారు?
కేకే అధ్యక్షతన 15 మందితో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతామో చెబుతాం. కొంగరలాన్‌ సభలో తాయిలాలు ప్రకటిస్తారని రాశారు. అసెంబ్లీ రద్దు గురించి చెబుతామనుకున్నారు. అది నేనుగా చెప్పకూడదు. మంత్రిమండలి నిర్ణయం. వరాలు ప్రకటిస్తే, తెల్లారి జీవోలిచ్చి అమలు చేయాలి. నిన్నటి వరకు చెప్పగలిగింది చెప్పాం. తప్ప కొత్తవి చెప్పడం అనైతికం అవుతుంది. రాబోయే ఐదేళ్ల గురించి పూర్తి అవగాహన ఉంది. ఆదాయం, ఖర్చులపై బాధ్యతగా చెప్పాలి. మళ్లీ అధికారంలోకి వస్తే తెరాస ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తాం.

Comments

Popular posts from this blog

Ekkees Tareekh Shubh Muhurat - full movie | Sanjay Mishra & Chandr...

చెన్నూర్ నుంచి బాల్క.. ఆందోళ్ నుంచి జర్నలిస్ట్ క్రాంతి

తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు . ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ telangana cm kcr