కేసీఆర్‌ నిర్ణయానికి ఐదు కారణాలు 5 kcr reasons behind before elections

మరో తొమ్మిది నెలల పదవీకాలం ఉండగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రతిపక్షాలు తమ పాలనకు అసహనంతో అడ్డు తగులుతున్నాయని, అందువల్లే ప్రజాకోర్టుకు వెళుతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే, ఆయన ముందస్తు ఎన్నికల నిర్ణయానికి అంతకు మించిన కారణాలేవో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. 1) మోదీ పట్ల వ్యతిరేకత 2) కాంగ్రె్‌సకు కాలూ చేయీ కూడగట్టుకొనే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడటం 3) వేసవి ఇబ్బందులు 4) శాసనసభ ఎన్నికల్లో నెగ్గి 2019 లోక్‌సభ ఎన్నికలకు వాతావరణాన్ని సిద్ధం చేయడం. 5) తనయుడిని ముఖ్యమంత్రిని చేయడం. ఈ ఐదు కారణాల వల్లే కేసీఆర్‌ ఏప్రిల్‌-మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలను నవంబరు-డిసెంబరుకు ముందుకు జరిపారని తెలుస్తోంది.

మోదీ పట్ల వ్యతిరేకత
దేశవ్యాప్తంగా మోదీ పట్ల వ్యతిరేకత తార స్థాయికి చేరింది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, పెట్రో ధరల విషయంలో మధ్యతరగతి ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ముస్లిములు మోదీని గద్దె దించేందుకు బీజేపీని గట్టిగా వ్యతిరేకించే శక్తులకు బేషరతుగా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ముస్లిములు టీఆర్‌ఎస్‌, బీజేపీలు మిత్రులనే అభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు వస్తే మోదీ వ్యతిరేక శక్తులు తనకు కూడా వ్యతిరేకం అవుతాయని, కాంగ్రె్‌సకు ఓటేస్తాయనే అనుమానం టీఆర్‌ఎ్‌సను పట్టి పీడిస్తోంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం మెరుగవుతుంది.

సీఎంగా తనయుడు
శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించి గెలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత తనయుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడం తేలిక అవుతుందని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వస్తే కేసీఆర్‌ తన జాతీయ రాజకీయ ఆశల గురించి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడితే రాష్ట్రంలో వారసుడెవరో ఎన్నికల ముందే చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పడం వల్ల శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయావకాశాలకు గండి పడుతుందనే భయం వెంటాడుతోంది.

కాంగ్రెస్ కు టైం ఇవ్వొద్దు
నాలుగేళ్ల క్రితం శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ కొద్ది నెలల క్రితం వరకు నిస్తేజంగా ఉంది. రాహుల్‌ నేతృత్వంలో కొద్ది రోజులుగా తెలంగాణలో రోజు రోజుకూ పుంజుకుంటోంది. కర్ణాటకలో సంకీర్ణం రూపంలో అధికారాన్ని కాపాడుకోగలిగినా నిధుల పరంగా ఇంకా కాలూచేయీ కూడగట్టుకోలేదు. పంజాబ్‌లో ఏడాది క్రితమే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ కాంగ్రె్‌సకు నిధులు సమకూర్చే పరిస్థితిలో అధిష్ఠానం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే కాంగ్రెస్‌ అయోమయంలో పడుతుందన్నది కేసీఆర్‌ ఆలోచన. లోక్‌సభ ఎన్నికల వరకు మరో ఆర్నెల్ల సమయం ఇస్తే రాష్ట్రంలో ఇటు రాజకీయంగానూ, అటు ఆర్థిక పరంగానూ కాంగ్రెస్‌ బలపడుతుందనే అనుమానం టీఆర్‌ఎ్‌సకు ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్లు పాలించిన కేసీఆర్‌కు మిగిలిన కల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీలో చక్రం తిప్పడం. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను అవకాశంగా చేసుకొని శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించి, అధికారాన్ని తిరిగి దక్కించుకుంటే కాంగ్రెస్‌ పూర్తిగా డీలా పడిపోతుందని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ఇలాంటి సానుకూల వాతావరణంలో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లను దక్కించుకోవచ్చని భావిస్తున్నారు. కుదిరితే తృతీయ ఫ్రంట్‌కు నేతృత్వం వహించడమో, లేదంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు ప్రాణవాయువు అందించే కీలక స్థాయిలో ఉండటమో కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు.

వేసవి ఇబ్బందులు
ఈ ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు ప్రధాన రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చిప్పటికీ అంతకుముందు సుదీర్ఘ సమయం వర్షాల్లేక రాష్ట్రం అల్లాడిపోయింది. దాంతో తాగునీటికి, తిండి గింజలకు, పశుగ్రాసానికి కరవు వస్తుందనే సూచనలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకపోయినా ఎన్నికల కోసం ఏప్రిల్‌-మే వరకు ఆగితే ఎండలు, నీటి ఎద్దడి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తాయనే అనుమానం ఉంది. దాని ప్రతికూల ప్రభావం ఎన్నికల్లో అధికారపక్షంపై ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. నవంబరు-డిసెంబరులో వాటి తీవ్రత అంతగా ఉండదు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అంతగా ఉండదని అంచనా వేస్తుంది.

Comments

Popular posts from this blog

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది telangana state ministers suspense

Ekkees Tareekh Shubh Muhurat - full movie | Sanjay Mishra & Chandr...