Posts

తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు . ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ telangana cm kcr

Image
తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ కాసేపటి క్రితం గవర్నర్‌ను కలిసి సమర్పించారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్‌.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ను కోరారు. గవర్నర్‌ సూచనను సమ్మతించిన కేసీఆర్‌.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగేందుకు అంగీకరించారు. కేసీఆర్‌తో పాటు మంత్రివర్గ సభ్యులందరూ ఆపద్ధర్మంగా కొనసాగనున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గవర్నర్‌ సూచనను అంగీకరించిన కేసీఆర్‌

(తెరాస) ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.కేసీఆర్‌

Image
 తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు, పార్టీ తరపున పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కె.కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ * కె.కేశవరావు(ఛైర్మన్‌) * ఏపీ జితేందర్‌రెడ్డి * జి.నగేష్‌ * ఈటల రాజేందర్‌ * టి.హరీష్‌రావు * జి.జగదీష్‌ రెడ్డి * తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ * అజ్మీర చందూలాల్‌ * టి. పద్మారావు * కొప్పుల ఈశ్వర్ * ‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి * ఫరీదుద్దీన్‌ * పి.రాములు * గుండు సుధారాణి

ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసినా తెరాస 100 సీట్లు గెలుస్తుంది. తెరాస విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని,దేశంలో అతిపెద్ద బఫూన్‌ రాహుల్‌గాంధీ అని ఆరోపించారు. తెరాస

Image
పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు అండగా ఉంటారా? ఆ పార్టీ మమ్మల్ని ఆహ్వానించలేదు. ఎంఐఎంతో స్నేహంగా ఉండే పార్టీతో పొత్తులు ఉండనే ఉండవని అమిత్‌షా చెప్పాడు. మమ్మల్నే మోదీ వ్యతిరేకి అంటున్నారు. ఈ ఎన్నికలు పూర్తయితే మేం కేంద్రంలో మోదీ వ్యతిరేకా? కాంగ్రెస్‌ వ్యతిరేకా? అనేది తెలుస్తుంది. భాజపా నేతలు మాట్లాడితే అంతే ఉండదు. వారి కథ తెలీదా? ఉన్న సీట్లలో గెలిస్తే చాలా గొప్ప. మాటలకు ఎన్నైనా మాట్లాడవచ్చు. పొద్దున్నే ప్రధాని కావాలని నాకుంది. అయితానా? కలలు మస్తుగా ఉంటాయి. భాజపా సంగతి సత్తా తెలియదా? వారేదో మాట్లాతుంటారు. అది నిజమవుతుందా? సమాఖ్య కూటమి మాటేమిటి? ఇప్పటికే నేను చెప్పాను. ప్రధాని, 29 రాష్ట్రాల సీఎంల సమావేశంలోనూ వెల్లడించాను. కేంద్రం వద్దే ఎన్ని అధికారాలు పెట్టుకుంది. దేశంలో కేంద్రీకరణ పెరుగుతోంది. కేంద్రం వద్ద విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి ఎందుకు? ఇవన్నీ రాష్ట్రాలకు ఉండాలి. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఎందుకు ఇవ్వరు? నా డిమాండ్‌ ఇలాగే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, దీనిపై మరో ఆలోచనకు తావులేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ...

105 మందితో తొలి జాబితా తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. మొత్తం 119 స్థానాలకు గాను 14 స్థానాల్లో అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో ఉంచారు.

Image
105 మందితో తొలి జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్‌, 13 మంది మంత్రులు.. సభాపతి, ఉపసభాపతిలకు మొదటి విడతలోనే టికెట్లు ఆందోల్‌, చెన్నూరులలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నిరాకరణ పెండింగ్‌లో మరో ఐదుగురు తాజా మాజీ శాసనసభ్యుల పేర్లు శాసనసభ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 105 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించారు. మొత్తం 119 స్థానాలకు గాను 14 స్థానాల్లో అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో ఉంచారు. శాసనసభ రద్దయిన గంటలోనే అనూహ్యంగా అధిక శాతం మంది అభ్యర్థుల పేర్లను  ప్రకటించటం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా విపక్షాల కంటే ఆయన ఒక అడుగు ముందుకేసి వాటికి సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా 13 మంది మంత్రులు, శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిలకు మొదటి విడతలోనే టికెట్లు లభించాయి. తొలి జాబితాలో తాజా మాజీలైన ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వలేదు. చెన్నూరులో నల్లాల ఓదెలు స్థానంలో ఎంపీ బాల్క సుమన్‌ను, ఆందోల్‌లో బాబూమోహన్‌ స్థానంలో పాత్రికేయుడు చంటి క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటి...