నేడే హుస్నాబాద్‌లో కేసీఆర్ శంఖారావం ఇదే టీఆర్‌ఎస్ తొలి ఎన్నికల ప్రచార సభ 50 రోజుల్లో 100 ప్రజా ఆశీర్వాద సభలు: హరీశ్
ముఖ్యమంత్రిగా అధికారులతో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ప్రగతి భవన్‌లోనే ఎక్కువ సమయం గడిపిన కేసీఆర్.. ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం హుస్నాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఎన్నికల శంఖం పూరించబోతున్నారు. ప్రగతి నివేదన సభ విజయవంతం కావడంతో అదే జోష్‌లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించడానికి టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. 50 రోజుల్లో 100 సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వంద సభల్లోనూ పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు. అందులో హుస్నాబాద్ సభ మొదటిది. ఈ సభ ఏర్పాట్లను గురువారం రాత్రి మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో కేసీఆర్ సభాస్థలికి చేరుకుంటారని తెలిపారు. ఇది చరిత్రాత్మక సభగా నిలవనుందని, పట్టణంలో 10 వేల మంది, చుట్టుపక్కల గ్రామాల నుంచి మరో 10 వేల మంది పాదయాత్రగా వస్తున్నారన్నారు. హుస్నాబాద్‌తో పాటు తెలంగాణలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. అందరి చూపు హుస్నాబాద్ వైపు అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత తొలి ఎన్నికల సభకు వేదిక కానున్న హుస్నాబాద్‌పై రాష్ట్రంలోని అందరి దృష్టి పడింది. హుస్నాబాద్ పట్టణంలోని బస్ డిపో గ్ర...